క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి- టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి- టూరిజం చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

కాకతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2022. షెటిల్ బ్యాట్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో.. పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..

ఈరోజు వరంగల్ పట్టణంలో.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్, ఇండోర్ స్టేడియంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన *కాకతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2022. షటిల్ బ్యాడ్మింటన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో..ముఖ్య అతిధిగా… డాక్టర్ తరుణ్ జోషి, IPS పోలీస్ కమీషనర్ ఆఫ్ పోలీస్, వరంగల్. కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..

ఈ కార్యక్రమంలో.. భాగంగా.. ఈ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (35 +55 )కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. అన్ని జిల్లాలకు చెందిన 150 టీమ్ లను సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. 35 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు 4 కేటగిరీల వారీగా విభజించి ఈ పోటీలు రెండు రోజుల పాటు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త కి స్వాగతం పలికి, షీల్డ్ బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. షటిల్ బ్యాడ్మింటన్ ఆడి టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా.. టూరిజం చైర్మన్ మాట్లాడుతూ… ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో.. వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించే షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, క్రీడలలో పాల్గొంటున్న
క్రీడాకారులు అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా.
శారీరక శ్రమతో కూడిన క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ క్రీడలు క్రీడాకారులకు ఆనందం, ఆరోగ్యం తో పాటు అందరికి స్పూర్తి దాయకంగా ఉంటుంది అన్నారు. ఇలాంటి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తూ..క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని ఆరోగ్యవంతంగా జీవించాలంటే అనవసరమైన విషయాలు వదిలేసి మంచి అలవాట్లు, సమయపాలన తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలని సూచించారు. *సీఎం కేసీఆర్ నాయకత్వంలో..* తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతున్నదని అన్నారు.అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా..పని చేస్తూ క్రీడలకు, క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జిల్లాకు ఒక స్టేడియం నిర్మాణం చేస్తున్నారని అన్నారు. నాకు కూడా క్రీడలు అంటే ఇష్టమని , క్రీడలకు, క్రీడాకారులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య , వరంగల్ ఈస్ట్ DCP,DCP వెంకట లక్ష్మీ, వరంగల్ సెంట్రల్ జోన్ DCP, Adl DCP పుష్ప, మరియు ASP సంజీవ్, ACP జితేందర్ రెడ్డి, వరంగల్ ACP గిరికుమార్, శ్రీనివాస్ ACP కాజీపేట, మరియు ఖమ్మం ACP వెంకటరమణ, CI లు , SI లు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.