క్యాన్సర్ బాధితురాలి కల సాకారం, చివ్వెంల పోలీస్ స్టేషన్ SHO గా ఒక్కరోజు విధుల నిర్వహణ..

*క్యాన్సర్ బాధితురాలి కల సాకారం, చివ్వెంల పోలీస్ స్టేషన్(police station). SHO గా ఒక్కరోజు విధుల నిర్వహణ .

*వైద్య మరియు ఆరోగ్యశాఖ, సూర్యాపేట(suryapeta) ఆధ్వర్యంలో మేక్ ఏ విష్ (కల సాకారం) కార్యక్రమం ద్వారా చివ్వేంల పోలీస్ స్టేషన్ లో ఒక్కరోజు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (SHO) గా పోలీస్ విధులు నిర్వర్తించిన అనారోగ్య బాధితురాలు.

*వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలియేటివ్ కేర్ విభాగంలో మేక్ ఎ విష్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్(ips).

*ఒక్క రోజు క్రితం స్వాతి తో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి(jagadish reddy).

*ఒక్క రోజు SHO గా యువతికి చివ్వేంల పోలీస్ స్టేషన్ నందు బాధ్యతలు ఇచ్చిన జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్ (rajendra prasad), జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం..

త్వరగా ఆరోగ్యం మెరుగుపడి పోలీస్ అధికారి కావాలన్న తన కోరిక నిజ జీవితంలో కూడా సహకారం కావాలని ఆశీర్వదించిన జిల్లా ఎస్పీ.

*చివ్వెంల మండలం జగన్ నాయక్ తండాకు చెందిన 23 సం. ల ధరావత్ స్వాతి పోలీస్ అధికారి కావాలన్నా కోరిక, క్యాన్సర్ కారణంగా ఆ కోరిక కలగానే మిగిలిపోయినది, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వెంకట్రావు(venkatra) సూచన మేరకు స్వాతి కోరిక మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్ SHO గా ఒక్క రోజులు విధులు నిర్వర్తించే విధంగా అవకాశం కల్పించామని వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మేక్ ఎ విష్ (కల సాకారం) కార్యక్రమం ద్వారా ఇది నిర్వహించడం జరిగినదని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ తెలిపినారు.*

*ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతి (swati) ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలి, తన ఆశయాన్ని, కళను నిజ జీవితంలో కూడా సాకారం కావాలని అన్నారు. ఈ కార్యక్రమం ఆమెలో ఎంతో ఆనందాన్ని, దైర్యన్ని నింపింది అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో పట్టుదల కలిగి, కలలను సాకారం చేసుకోవాలని అన్నారు. తన కోరిక మరియు తన ఆరోగ్య పరిస్థితులను తెలిసిన వెంటనే ఇలాంటి అవకాశం కల్పించాలని అనుకున్నామని దీనికి కార్యరూపం దాల్చి వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మేక్ ఏ విష్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

*SHO గా బాధ్యతలు తీసుకున్న అనంతరం స్వాతి గారు పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడినారు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం కలిగేలా విచారణ చేసి ధైర్యం కల్పించాలని అండగా ఉండాలని ఆదేశించారు. నాకు అండగా ఉండి ఈ అవకాశం కల్పించి నా కళను నిజం చేసిన జిల్లా ఎస్పీకి, అధికారులకు, జిల్లా పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపతున్నట్లు స్వాతి గారు పేర్కొన్నారు.

*ఎస్పీ రాజేంద్రప్రసాద్ గారితో పాటుగా ఈ కార్యక్రమంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ కోటచలం, డిప్యూటీ డి.యం.హెచ్.ఓ డా.హర్షవర్ధన్, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , పాలియేటివ్ కేర్ వైద్యాధికారి డాక్టర్ సతీష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమ్ నారాయణ సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్టేషన్ ఎస్ఐ విష్ణుమూర్తి, డాక్టర్ శ్వేత , భూతరాజు సైదులు , సాంబశివరావు , స్టాఫ్ నర్స్ లు త్రివేణి, వాణి జోసెఫ్ , శాంత కుమారి , స్వాతి తల్లిదండ్రులు, సిబ్బంది, మీడియా మిత్రులు పాల్గొన్నారు.