సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు…!..

13.11.2023.

సూర్యాపేట జిల్లా.

జిల్లాలో 30 నామినేషన్లు (స్క్రూటిని లో) తిరస్కరణ.

124 నామినేషన్లు చెల్లుబాటు.

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.

జిల్లాలో ఈ నెల 3 నుండి 10 వరకు 154 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా 30 నామినేషన్లు (స్క్రూటినిలో) తిరస్కరించ బడ్డాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు.
హుజూర్ నగర్ నియోజక వర్గం నుండి 40 అభ్యర్థులకు గాను 5 తిరస్కరణ 35 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని తెలిపారు.

కోదాడ నియోజక వర్గం నుండి 39 అభ్యర్థులకు గాను
3 తిరస్కరణ 36 మంది నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ,

సూర్యాపేట నియోజక వర్గం నుండి 42 అభ్యర్థులు నామినేషన్లు వేయగా 10 తిరస్కరణ 32 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని అన్నారు.

తుంగతుర్తి నియోజక వర్గంలో 33 అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 తిరస్కరణ 21 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని అన్నారు. జిల్లాలో మొత్తం 154 అభ్యర్థులు నామినేషన్లు వేయగా 30 నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని అలాగే 124 అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటులో ఉన్నాయని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.