*సూర్యాపేట జిల్లా..*
సూర్యాపేట లో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకోండ కృష్ణ అనే యువకుడు ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై ఆయన మృతదేహం ఉంది. బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.!! పాతకక్షలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.