సూర్యాపేట జనగర్జన సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజాసింగ్..

*సూర్యాపేట జిల్లా కేంద్రం*

*సూర్యాపేట జనగర్జన సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజాసింగ్*

**బంగారు తెలంగాణ కాదు, మద్యం తెలంగాణ*

*#మోసపూరితమైన పథకాలు తీసుకు వచ్చిన సీఎం కేసీఆర్*

*# ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు*

*#కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభ ను జయప్రదం చేయండి*

*#సూర్యాపేట :* తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చుతానని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ మద్యం తెలంగాణ గా మార్చారని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే అమిత్ షా ప్రజాగర్జన సభ ఏర్పాటు పనులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సభ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మోసపూరితమైన పథకాలను తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. దళితబంధు పేరుతో మొదటి విడతలో వందమందికి వచ్చి ఆ తర్వాత ఆ పథకంను పట్టించుకోకుండా, దళితులను మోసం చేశాడని ఆయన అన్నారు. దళితులకు మాట ఇచ్చి, మాట తప్పిన మోసకారి సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. బీసీ బంధు పథకం లో సూర్యాపేట జిల్లాలో ఎంతమందికి బీసీ బంధు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఎంతమందికి బీసీ బంధు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు. దీంతో పాటుగా గృహాలక్ష్మీ పథకం ద్వారా మూడు లక్షలు ఇస్తామని చెప్పి జిల్లాలో ఒక్క కుటుంబానికి కూడా గృహాలక్ష్మీ పథకం లో డబ్బులు రాలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడానికి రాష్ట్రం లో డబ్బులు లేవని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంపై లక్ష కోట్ల అప్పు ఉంది. తెలంగాణ రాష్ట్రం అప్పుల తెలంగాణ గా,మద్యం తెలంగాణ గా సీఎం కేసీఆర్ మార్చివేశాడని ఆయన అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసిన వైన్స్ షాపులు, బార్ షాపులను తెరిశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష కాన్ని సీఎం కేసీఆర్ సర్వ నాశనం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే, అది కాంగ్రెస్ కు పోతుందని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే, బీఆర్ఎస్ కు పోతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు గట్టి పోటి ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. బీజేపీ కి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండటని ఆయన ప్రజలను కోరారు. శుక్రవారం నిర్వహించే అమిత్ షా సభ కు భారీగా జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు.