రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా చౌదరి భారీ విరాళం.

*రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా చౌదరి భారీ విరాళం*

హైదరాబాద్: అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కుల, మత, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రజలందరూ రామమందిర నిర్మాణానికి భాగస్వాములు అవుతున్నారు. తమకు నచ్చినంత డబ్బులు విరాళం ఇస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కుటుంబం కూడా అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళం ఇచ్చింది. ఎంపీ సుజనా కుటుంబం తరపున రూ.2.2 కోట్ల విరాళం ఇచ్చారు. తన తండ్రి యలమంచిలి జనార్థనరావు పేరు మీద ఎంపీ సుజనాచౌదరి రూ. 2 కోట్ల 2 లక్షల 32 వేలు విరాళంగా ఇచ్చారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షలు, సీసీఎల్‌ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షలు విరాళం ఇచ్చారు.