తినడానికి తిండి లేక, చేతిలో ఒక్క రూపాయి లేకుండా ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోయిన్ తల్లి..

సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే సినిమా అనేది జూదం లాంటిది.ఒక సినిమా హిట్ అయితే టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు.అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయితే పాతాళానికి పడిపోతారు.ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు గాని, హీరోయిన్స్ గాని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను ఫాలో అవుతూ క్రేజ్ లో ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేస్తూ క్రేజ్ ను వాడుకుంటూ ఫేముకి ఫేము డబ్బుకు డబ్బు సంపాదిస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోని వరుసగా సక్సెస్ లు పడితేనే ఇక్కడ ఎక్కువ రోజులు కొనసాగుతారు లేదంటే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సింగర్ గా, హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకుంది.
అయితే శృతిహాసన్ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన కూడా ఆమె తల్లి ని పట్టించుకోవట్లేదు అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన సారిక కమలహాసన్ దంపతులకు శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు జన్మించారు.అయితే చాలా రోజుల నుంచి శృతిహాసన్ తన తల్లికి దూరంగా ఉంటుందంటూ మీడియాలో చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున కథనాలు అయితే వస్తున్నాయి.ఇక రీసెంట్ గా సారిక ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ తనను దూరంగా పెట్టిందని,తన దగ్గరికి ఎక్కువగా రావట్లేదని తనతో ఎక్కువగా మాట్లాడట్లేదని చెప్పింది.

ఇక ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో సారికకి తినడానికి తిండి లేక, చేతిలో ఒక్క రూపాయి లేకుండా ఉన్న సమయంలో శృతిహాసన్ కి, కమలహాసన్ కి ఫోన్ చేసిన కూడా వాళ్ళు ఒక రూపాయి కూడా సహాయం చేయలేదంటూ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం ఇప్పుడు అసక్తికరం గా మారింది.ఇక ఇప్పటికి కూడా తన స్వశక్తి మీదనే తను బతుకుతున్నట్టుగా చెప్పింది. అలాగే ముంబైలో ఉంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది తెలుసుకున్న చాలామంది సినిమా అభిమానులు శృతిహాసన్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన తల్లిని అలా దూరంగా పెట్టీ ఇబ్బంది పెట్టడం కరక్ట్ కాదు అంటూ శ్రుతి హాసన్ మీద భారీ ఎత్తున నెగటివ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది.

ఇక ఈ క్రమంలోనే శృతిహాసన్ కమల్ హాసన్ ఇద్దరు చెన్నై లోనే ఉంటున్నారు కానీ సారిక మాత్రం ముంబై లో ఉంటుంది…ఇక శృతి హాసన్ అభిమానులు సైతం ఈ ఏజ్ లో అమ్మని అలా ఒంటరి గా ఉంచి ఇబ్బంది పెట్టడం కరక్ట్ కాదు మీతో పాటు గానే అమ్మ ను కూడా ఉంచుకోండి అని శృతి కి సలహాలు ఇస్తున్నారు…