స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్తుండటం, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ కంపెనీల షేర్లతో పాటు బ్యాంకింగ్ షేర్లు మార్కెట్లను వెనక్కి లాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి 59,330కి పడిపోయింది. నిఫ్టీ 287 పాయింట్లు కోల్పోయి 17,604కి దిగజారింది. ఆటో, హెల్త్ కేర్ మినహా మిగిలిన సూచీలన్నీ ఈరోజు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (6.34%), ఐటీసీ (1.77%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.71%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.41%), ఎన్టీసీపీ (0.21%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.43%), యాక్సిస్ బ్యాంక్ (-2.07%), కొటక్ బ్యాంక్ (-2.03%).