ప్రకృతి వైపరీత్యాలతో గడగడలాడితున్న పలు దేశాలు…. ప్రపంచ వినాశనానికి సంకేతాలు అంటూ ప్రచారం….!

https://mobile.twitter.com/RexChapman


విది ఎన్నడూ చూడని విధంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతున్నాయి….. నిన్న మొన్నటి వరకు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంటే ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలు మాత్రం మరోలా వణికిస్తుంది ప్రజలని….సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూలన పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతూ ప్రపంచానికి భయభ్రాంతులకు గురి అవ్వడం జరుగుతుంది…ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మానవాళి అంతాన్ని సూచిస్తోందనీ, త్వరలోనే ప్రపంచం అంతం కాబోతోందని ప్రముఖ పాస్టర్ పౌల్ బెగ్లే చెబుతున్నారు. క్రీస్తు రెండో రాకడకు ఇవి సూచనలు అని కూడా ఆయన వివరిస్తున్నారు. నీళ్లు దొరకని ఎడారిలో మంచు కురవడం అన్నది ప్రపంచం అంతం కాబోతోందనడానికి మరో చిహ్నమని చెబుతున్నారు. ప్రపంచం అంతానికి సూచనలను బైబిల్ లో ఎప్పుడో ఏసుప్రభువు చెప్పాడంటున్నారు. ’ఎడారిలో మంచు కురుస్తుంది. మనుషులు భయపడే అడవులే గులాబీల్లా వికసిస్తాయి. నేను కొత్తగా ఎవరూ ఊహించని కార్యాలను జరపబోతున్నాను. అకస్మాత్తుగా జరిగే ఆ అద్భుత కార్యాలను మీరు గ్రహించాలి. ఎడారిలో నదులను సృష్టిస్తాను, అరణ్యంలో రహదారిని కలుగజేస్తాను‘ అంటూ బైబిల్ లో ఉన్న వాక్యాలను పాస్టర్లు గర్తు చేస్తున్నారు..ఇదంతా కొందరి కల్పనే అంటూ కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు….. ప్రపంచం అంతం గురించి వస్తున్న వార్తలు అన్నీ కూడా అవాస్తవమని….. మానవ తప్పిదాల వల్లే ఎన్నో వినాశనాలు ఎదుర్కోబోతున్న మని…. అంటున్నారు…. శాస్త్రవేత్తలు……ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది అని అది యాదృచ్చికంగా అనే జరుగుతుంది అనే భావన లోనే ఉండాలి కానీ ప్రపంచం అంతం కాబోతుంది అంటూ కొందరు చేస్తున్న ప్రచారాలు వాస్తవం లలేదు అంటున్నారు….


గతంలో కూడా ఇలాగే ప్రచారాలు చేసి చివరకు అదంతా అభూత కల్పన అని తెలిసేసరికి చాలామంది రి భయభ్రాంతులు లోకి వెళ్ళిపోయారు ప్రస్తుతం కూడా అలాగే ప్రచారం జరుగుతోందని ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు ఎవరూ కూడా నమ్మొద్దని అంటున్నారు..మంచు వర్షంతో అగ్ర దేశాల సైతం అతలాకుతలం అవుతున్నాయని…… అలాంటి వీడియోల వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తప్ప.. ప్రపంచమే అర్థం కాబోతుందని అపోహలు ఉండకూడదు..