అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?
*వాస్తవానికి శరీరము ఆత్మ రెండు వేరు వేరు*.
*కలియుగ ధర్మము ప్రకారము.. మనిషి జీవితకాలము 120 సంవత్సరాలు*.
*కానీ ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపుకి పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమ యాత్ర అవుతుంది*.
*ఆత్మ చెప్పినట్టు శరీరము వినాలంటే… శరీరము ఆరోగ్యము గా ఉండాలి*.
*శరీరము లో ప్రాణము ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరము చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు…… ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరము వినే స్థితిలో లేదు*.
*బతికి ఉన్నంత కాలము భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినడం, పైసా సంపాదన లో లీనమై పోతుంది*.
*ఎప్పుడైతే మనిషి చనిపోతాడో… శరీరము నుండి ఆత్మ వేరైపోతుంది*.
*శరీరాన్ని దహనము చేసే దాకా… ఆత్మ, మళ్లీ తన శరీరము లోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి… తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది*.
*పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరము లో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు*.
*ఎందుకంటే…….. శరీరాన్ని (పూడ్చిన) కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద….. తన వాళ్ళ మీద……. ఇష్టము తో ఆత్మ ఇంటికి రావాలని తపన పడుతూ ఉంటుంది*.
*కానీ శరీరము మీద చల్లిన పేలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే……… ఆత్మకి, తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా ‘సూర్యోదయము’ లోపు మాత్రమే*..
*అంతలోపు లెక్కించక పోతే, మళ్ళీ… తిరిగి మొదటి నుండి లెక్కించాలి*.
*శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే*
*కుండ నీ శరీరము లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రము నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో… నీ శరీరము నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాము అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. (పూడ్చేస్తాము) ఇంకా నీకు ఈ శరీరము ఉండదు, నువ్వు వెళ్ళిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతము*.
*మనం చేసే ప్రతి పనికి ఓ అర్థము దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ*…
…..