నగరంలో వీధి కుక్కల(street dogs) దాడిలో అయిదేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్(minister ktr) స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటన చాలా విషాదకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.