సుజనా చౌదరికి కేంద్రం బిగ్ షాక్..!!

*హైదరాబాద్.. భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దయినట్లు తెలుస్తోంది..

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరంలో ఈ వైద్య కళాశాలలో సీట్లను భర్తీ చేయకూడదని ఆదేశించినట్లు చెబుతున్నారు..

ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను నిలిపివేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు. దీనితో త్వరలోనే కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్శిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ గుర్తింపు రద్దు కావడం వల్ల తెలంగాణ 100 మెడికల్ సీట్లను కోల్పోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఇతర మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలో సర్దుబాటు చేయొచ్చనే అంచనాలు లేకపోలేదు..