సుఖేష్ చంద్రశేఖర్, గవర్నర్ కు మరో లేఖ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లపై ఫిర్యాదు..!

లేఖలతో సంచలనం సృష్టిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖస్త్రాన్ని సంధించాడు. అటు క్రేజివాల్, ఇటు కవితలను టార్గెట్ చేస్తే సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పటికే పలు లేఖలు రాసిన సుఖేష్ ఈ సారి మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ… తెలంగాణ గవర్నర్‌కు లేఖ రాశాడు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లపై గవర్నర్‌కు సుఖేష్ ఫిర్యాదు చేశాడు. తన కుటుంబసభ్యులను ఒత్తిడి చేస్తున్నారని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లపై పలు ఆరోపణలు చేస్తూ.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశాడు. ”నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా” అంటూ లేఖ రాశాడు.