30 మందిని దత్తత తీసుకున్న సుమ..

30 మందిని దత్తత తీసుకున్న సుమ….

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ ఇటీవల చెన్నైలో ఓ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. “నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఇంతదాన్ని చేశారు. అందుకే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్’ అనే సంస్థ నా డ్రీమ్. నాకు వచ్చేదాంట్లో నేను తినడమే కాదు నావంతుగా 30 మందిని దత్తత తీసుకున్నా. వాళ్లు సెటిల్ అయ్యే వరకు వాళ్లతో ఉంటాను” అని తెలిపారు