తెలంగాణవ్యాప్తంగా ఎండలు…

తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపుడుతున్నాడు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు బుధవారం నుంచి మరో ఐదు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు రాష్ట్ర ఉష్ణోగ్రతలు సైతం స్వల్పంగా పెరిగాయి.జనం ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో బుధవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 44.3, చాప్రాలా (ఆదిలాబాద్‌) 43.8, జూలూర్‌పాడ్‌ (కొత్తగూడెం) 43.8, అర్లి-టీ (ఆదిలాబాద్‌) 43.1, కొమ్మెర (మంచిర్యాల) 43, మణుగూరు (కొత్తగూడెం) 42.9, మెండోరా (నిజామాబాద్‌) 42.9, కానాయిపల్లి (వనపర్తి) 42.8, జైనా (జగిత్యాల) 42.8, ముప్కల్‌ (నిజామాబాద్‌) 42.6 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది..