రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. వడదెబ్బతో 107 మంది మృతి..
మరో మూడు రోజులు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక..
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. తీవ్ర ఉష్ణోగ్రతలతో 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎండల తీవ్రత కారణంగా గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు సమాచారం. మరో మూడు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.