40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు…!

*గ్రేటర్ లో ఎండలు ఇప్పుడిప్పుడే మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెల కాకముందే ఎండలు మండిపోతుండడంతో మార్చి నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.*

గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జూబ్లీహిల్స్‌లో 38.4 డిగ్రీలు, సరూర్‌నగర్, చందానగర్‌లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6 డిగ్రీలు, ఉప్పల్‌లో 37.3 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఏ రేంజ్‌లో ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.