ప్రముఖ రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు కన్నుమూశారు. 71 ఏళ్ల సుందరం మాస్టర్ హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వస విడిచారు. నాటక రంగానికి నవ్వులు అద్దిన రచయిత సుందరం మాస్టారు. తనదైన ఛలోక్తులులతో నవ్వులు పూయించిన సుందరం మాస్టారు కన్నుమూయడంతో నవలాలోకం నిశీధి నిండిపోయింది. సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు సుందరం మాస్టారు. ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని తన మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేశారు. ఆతర్వాత విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఆయనను ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు..నాటక రచన, ప్రదర్శనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. రెండు వందలకుపైగా నాటకాల్లో నటించారు. నాటకానికి హాస్యం వైపు మళ్లించే ప్రయత్నంలో విజయం సాధించారు. సుందరం మాస్టారు కన్నుమూయడంతో పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. సుందరం మాస్టారు కుమారుడు, కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తరువాత ఈనెల 23న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సుందరం మాస్టారు అంత్యక్రియలు జరగనున్నాయి. 1950 అక్టోబరు 29న ఒంగోలులో జన్మించారు సుందరం మాస్టారు. బీఎస్సీ చదివిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య శిరీష మరణించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.