సన్నీ లియోన్ హాట్ హాట్ కామెంట్స్…

సన్నీ లియోన్ ఆ తర్వాత బిగ్‌బాస్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
తన అందచందాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. హిందీ చిత్ర సీమలోనే కాదు.. పలు దక్షిణాది భాషల సినిమాల్లో కూడా ఐటెమ్ సాంగ్స్‌లో నర్తించింది. శృంగార తారగానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ నటిగా కూడా తాను మెప్పించగలనని అంటోంది. అయితే ప్రేక్షకులు తన నుంచి సెక్సీ‌నెస్ మాత్రమే కోరుకుంటున్నారని, అందుకే అలాంటి పాత్రల్లోనే కనిపిస్తున్నానని చెప్పింది..ప్రేక్షకులు నా నుంచి కోరుకునేది అదే.. `నా వద్దకు వచ్చే వారందరూ హాట్ రోల్స్, ఐటెం సాంగ్స్ కోసమే వస్తారు. తెరపై అందాల ప్రదర్శన చేయాలని అడుగుతుంటారు. వారలా అడగటం నాకేం ఇబ్బంది కాదు. ప్రేక్షకుల అభిరుచి మేరకే దర్శక నిర్మాతలు సినిమాలు తీస్తారు. ప్రేక్షకులు నన్ను శృంగార తారగానే చూస్తున్నారు. నా సినిమాలు సెక్సీగా, సెన్సువల్‌గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కాబట్టి నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. నేను అవే చెయాల్సి వస్తోంది అని సన్నీ పేర్కొంది.