ఇక నుంచి మీరే నాకు అమ్మ నాన్న: సూపర్‌స్టార్ మహేశ్ బాబు..

గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోనే జరిగింది. మూవీ టీమ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఈవెంట్‌లో మహేశ్ బాబు స్పీచ్ మాత్రం మాములుగా లేదు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ మహేశ్ ఎమోషనల్ అయ్యారు. తన సినిమా రికార్డుల గురించి మాట్లాడటానికి ఇప్పుడు నాన్న తనతో లేరని.. ఇకపై మీరే నాకు అమ్మానాన్న అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ స్పీచ్‌పై ఓ లుక్కేయండి,.

.సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు. అయితే అందరూ ఎదురుచూసే డైరెక్టర్ త్రివిక్రమ్ సింపుల్ స్పీచుతో ముగించేశాడు. హీరో మహేశ్ మాత్రం ఊహించని విధంగా ఎమోషనల్ అయ్యాడు. అభిమానులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయగా ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి..

త్రివికమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటోళ్లు. నేను ఆయన గురించి బయట ఎ‍ప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడుతాం. గత రెండేళ్ల నుంచి ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ అస్సలు మర్చిపోలేను. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా నాకు వింతగానే ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోం.

ఆయన (త్రివిక్రమ్) సినిమాల్లో నేను ఎప్పుడు చేసినా సరే ఓ మేజిక్ జరుగుతుంది. అది నాకు తెలీదు. ‘అతడు’ నుంచి మా జర్నీ మొదలైంది. ‘ఖలేజా’లో ఒక మేజిక్ జరిగింది. అదే మేజిక్ ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ జరిగింది. మీరు ఓ కొత్త మహేశ్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే(త్రివిక్రమ్) కారణం.

ఇక చివర్లో కాస్త భావోద్వేగానికి గురైన మహేశ్ అభిమానులని ఉద్దేశిస్తూ.. ‘మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలీదు. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. బాగా గట్టిగా. ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్నీ మీ ఆశీస్సులు అభిమానం నా దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పి స్పీచ్ ముగించేశాడు.