సూపర్‌ స్టార్‌ కృష్ణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. ఆందోళనలో ఫ్యాన్స్​..!

సూపర్‌ స్టార్‌ కృష్ణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. ఆందోళనలో ఫ్యాన్స్​

అనారోగ్య కారణాల వల్ల కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న స్టార్ హీరో మహేశ్​ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుఝామున మహేశ్​ భార్య నమ్రత గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రికి చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. స్వల్ప గుండెపోటు కూడా వచ్చినట్లు సమాచారం. సీపీఆర్‌ కూడా చేశారట. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో సూపర్​స్టార్ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సీనియర్​ నటుడు నరేశ్​ తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యతో నిన్నే ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. మరో 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జి చేస్తారని వెల్లడించారు..