పాకిస్తాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్….

పాకిస్తాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తుంది. బలూచ్ ఉగ్రవాదుల చేరలో ఉన్న తమ సైనికులను విడిపించుకుంది. మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దు గార్డులను కిడ్నాప్ చేసి దాచిపెట్టారు. దీంతో ఇరాన్ దేశ సైనికులు పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసి గార్డులను విడిపించుకుంది. ఈ ఆపరేషన్‌లో ఆగ్నేయ ఇరాన్‌లోని ఐఆర్‌జిసి గ్రౌండ్ ఫోర్స్ కుడ్స్ బేస్ గార్డ్స్ విజయవంతంగా నిర్వహించారు…2018 అక్టోబర్ 16న ఇరాన్ – బలూచిస్తాన్ సరిహద్దుల వద్ద గొడవల్లో 12 మంది సైనికులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ కిడ్నాప్ చేసింది. అయితే, ఈ ఘటన అనంతరం మిలటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చారు. కిడ్నాప్ చేసిన వారిలో ఐదుగురిని 2018 మే 15న రిలీజ్ చేశారు. మరో నలుగురిని 2019 మే 21 మిలటరీ అధికారులు రక్షించారు. ఇప్పుడు ఇద్దరు సైనికులను రక్షించినట్టు ఇరాన్ ప్రకటించింది…చెందిన రాడికల్ వహాబీ ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ అనేది మిలటరీ ఆర్గనైజేషన్. దీన్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించింది. ఇరాన్ మీద ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఆగ్నేయ ఇరాన్‌లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇరాన్ సైనికులతో పాటు , ప్రజల మీద కూడా పలుమార్లు ఉగ్రదాడులు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 2019 లో ఇరాన్‌లోని బాసిజ్ పారామిలిటరీ స్థావరంపై దాడికి పాల్పడింది. ఓ బస్సుపై జరిపిన ఉగ్రవాద దాడిలో డజన్ల కొద్దీ ఐఆర్జిసి సభ్యులను చంపి గాయపరిచింది. దీనికి పాకిస్తాన్ ఆర్మీ సహకారం ఉందని ఇరాన్ నిఘావర్గాలు వెల్లడించాయి…మరోవైపు, పాకిస్తాన్ భూభాగాల్లో ఉగ్రవాద గ్రూపులు ఉండటంపై ఇరాన్ మిలటరీ, పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం సరిహద్దు పోలీసులపై నియంత్రణ లేదని విమర్శించారు…