దర్శకుడు సూర్య కిరణ్ తుది శ్వాస విడిచారు..

సీనియర్ హీరోయిన్ కల్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ తుది శ్వాస విడిచారు.

సోమవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు.

గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన..
ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది.

కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు.

ఆయన మరణంతో సిని ఇండస్ట్రీలో విషాధ చాయలు అలముకున్నాయి. ..

చికిత్స తీసుకొంటూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ద‌ర్శ‌కుడిగా ఫామ్‌లో ఉన్న‌ప్పుడే హీరోయిన్ క‌ల్యాణికి పెళ్లి చేసుకొన్నారు. ఆ త‌ర‌వాత కొంత‌కాలానికి విడిపోయారు. న‌టి సుజిత‌కు స్వ‌యానా సోద‌రుడు కూడా. బాల న‌టుడ‌గిగా రంగ ప్ర‌వేశం చేసి దాదాపు 200 చిత్రాల్లో న‌టించారు. కొన్ని సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసి, ఆ త‌ర‌వాత ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులేశారు. బిగ్ బాస్ సీజ‌న్ 6లో మెరిశారు. సూర్య కిర‌ణ్ మ‌ర‌ణ వార్త విని టాలీవుడ్ షాక్‌కి గుర‌వుతోంది. ఆయ‌న అనారోగ్యం విష‌యం కూడా ఎవ్వ‌రికీ తెలీదు. సూర్య‌కిర‌ణ్‌కి స‌న్నిహితులు ఎవ‌రూ లేక‌పోవ‌డ‌డంతో ఆయ‌న ఆరోగ్య విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు..