పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’కు ఆమోదం..ఫ్రీ కరెంట్‌..!!?

పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన(PM-Surya Ghar Muft Bijli Yojana)’ పేరుతో అమలుచేసే ఈ పథకానికి రాయితీని రెండు భాగాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది..

ప్రధాని ధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ‘పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి గరిష్ఠంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది..ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రజలు నెలకు 300 యూనిట్ల కరెంటును ఉచితంగానే పొందవచ్చు. కేంద్రం ఈ కొత్త పధకం కోసం ఏకంగా రూ.75000 కోట్లు వెచ్చిస్తోంది.

పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన(PM-Surya Ghar Muft Bijli Yojana)’ పేరుతో అమలుచేసే ఈ పథకానికి రాయితీని రెండు భాగాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది.

సబ్సిడీ వివరాలు
కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ విద్యుత్ పథకాన్ని పలు విధాలుగా విభజించి సబ్సిడీ అందిస్తోంది. దీని కింద ఒక కిలోవాట్ సిస్టమ్‌కు రూ. 30000, రెండు కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 60000, మూడు కిలోవాట్ల సిస్టమ్‌కు ఏకంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి సుమారు రూ.1.45 ఖర్చు అవుతుంది. ఇందులో సగం వరకు రాయితీ లభిస్తుంది. రాయితీ కాకుండా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే అందిస్తాయి.ఉదాహరణకు 3 కిలోవాట్ సిస్టమ్‌కు రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రూ.1.45 ఖర్చు అయిందనుకున్నప్పుడు, అందులో రూ. 78000 రాయితీ లభిస్తుంది. కాబట్టి మిగిలిన రూ. 67000 కూడా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే పొందవచ్చు.

నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే 150 యూనిట్ల నుంచి 300 యూనిట్లను ఉపయోగించుకునే వారికి 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిం రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారత్‌ స్వావలంబన దిశగా పయనించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన(PM-Surya Ghar Muft Bijli Yojana)’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద దేశ వ్యాప్తంగా సుమారు కోటి మంది తన ఇంటి పై భాగంలో సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ను వినియోగించుకోవచ్చు. ఈ సోలార్ రూఫ్ టాప్ యూనిట్ లను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వినియోగదారునికి లబ్ధి చేకూర్చుతుంది.

ఈ పథకం క్రింద రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ను ఏర్పాటు చేసుకునే వినియోగ దారులకు ఒక కిలో వాట్‌ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్‌ పోర్టల్‌ https:// pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్‌ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కూడా కేంద్రం కల్పించింది..