సూర్య కుమార్ యాదవ్ ప్లేస్ లో రవిచంద్రన్ అశ్విన్..!!!

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడపోతుంది. ఇక బుధవారం జరిగే ఈ మ్యాచ్ లో రెండు టీములు కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ రెండు టీముల్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనేది చెప్పడం కష్టంగా మారింది.ఇక ఇండియన్ టీమ్ ఇది ఒక రివెంజ్ మ్యాచ్ గా ఆడుతూ ఉంటే న్యూజిలాండ్ మాత్రం గత సంవత్సరం ఫైనల్ కి వచ్చి చివరి నిమిషంలో ఓటమిపాలైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈసారి సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్లో కూడా తమ సత్తా ఏంటో చాటుకోవాలని చూస్తోంది.అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం కప్పు మిస్సయ్యే ప్రసక్తే లేదు అన్న రేంజ్ లో ముందుకు దూసుకువస్తుంది…ఇక ఇండియన్ టీమ్ ప్లేయర్లు మాత్రం రివెంజ్ తీర్చుకొని న్యూజిలాండ్ టీమ్ ని చిత్తు చిత్తు గా ఓడిస్తాం అంటూ ఇప్పటికే ఒక మంచి స్పిరిట్ తో ఉన్నారు…ఇక న్యూజిలాండ్ ప్లేయర్లు మంచి ఫామ్ ను కనబరుస్తూ గత మ్యాచ్ లో కూడా శ్రీలంక మీద భారీ విజయాన్ని అందుకొని గ్రాండ్ గా సెమీఫైనల్ లోకి అడుగుపెట్టారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఇండియా టీం ఎలా ఎదుర్కొంటుందో అనేది కూడా ఒక పెను సవాల్ గా మారుతుంది.ఇక ఇండియన్ టీమ్ విషయానికి వస్తే వరుసగా తొమ్మిది మ్యాచ్ ల్లో విజయం సాధించి ఈ వరల్డ్ కప్ టోర్నీ లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే వరుసగా పది విజయాలను సాధించిన టీమ్ గా మంచి గుర్తింపు కూడా పొందుతుంది. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగంలో శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , శ్రేయస్ అయ్యర్ , రాహుల్ లాంటి ప్లేయర్లు కీలకం గా మారనున్నారు.ఇక ఈ ఐదుగురిలో ఎవరైనా ముగ్గురు ప్లేయర్లు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే ఇండియన్ టీమ్ ఈజీ గా ఈ మ్యాచ్ గెలిచేస్తుంది. అలాగే బౌలింగ్ లో షమీ, బుమ్ర, సిరాజ్ లతో పాటుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు కూడా సమిష్టిగా రాణిస్తే ఇండియన్ టీమ్ గెలుపు అనేది నల్లేరు మీద నడకే అవుతుంది…

అయితే న్యూజిలాండ్ టీం లో లెఫ్ట్ హ్యండర్ ప్లేయర్లు ఎక్కువగా ఉండటం వల్ల సూర్య కుమార్ యాదవ్ ప్లేస్ లో రవిచంద్రన్ అశ్విన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అశ్విన్ టీం లో ఉంటే తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో న్యూజిలాండ్ ప్లేయర్లను కొంత వరకు ఇబ్బంది పెడతాడు అనే ఉద్దేశ్యం తో అశ్విన్ ని టీమ్ లోకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇలా చేస్తే ఇండియన్ టీమ్ బౌలింగ్ విభాగంలో స్ట్రాంగ్ అవుతుంది.కానీ బ్యాటింగ్ లో మాత్రం మళ్లీ వీక్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఆడినంత స్ట్రాంగ్ గా అశ్విన్ బ్యాటింగ్ చేయలేడు…ఇక్కడ ఒకటి ప్లస్ అవుతుంటే మరొకటి మైనస్ అవుతుంది. అయితే ఇంతకుముందు ఇండియన్ టీమ్ లో హార్దిక్ పాండ్యా రూపంలో ఆల్ రౌండర్ ఉన్నాడు కాబట్టి అటూ బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.కానీ అతనికి చీలిమండ గాయంతో టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ అవ్వడంతో ఇండియన్ టీం కి కొద్దిగా కష్టాలైతే వచ్చి పడ్డాయనే చెప్పాలి… ఇక లీగ్ దశ లో ఇండియన్ టీం న్యూజిలాండ్ టీమ్ ని ఎలాగైతే చిత్తు చేసిందో ఇప్పుడు కూడా అలాగే చిత్తుగా ఓడించాలని చూస్తుంది…

ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది…

రోహిత్ శర్మ,శుభ్ మన్ గిల్,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కే ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా,సూర్య కుమార్ యాదవ్ / రవిచంద్రన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్ర, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరజ్…