పాక్షిక సూర్య గ్రహణము – సా5.02 – 6.27వరకు..

*నేటి విశేషం*

*పాక్షిక సూర్య గ్రహణము – సా5.02 – 6.27వరకు*

ఈనాడు భారతదేశంలో స్వాతి నక్షత్రం, తులారాశిలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది.

*గమనిక :* గ్రస్థాస్తమయ సూర్య గ్రహణం అగుటచే గ్రహణ మోక్షం (గ్రహణ విడుపు) కనిపించదు,
జ్యోతిష్కుల సలహా ప్రకారం… హైదరాబాద్, పరిసర ప్రదేశంలో సూర్యగ్రహణ సమయాలు సాయంకాలం ఇలా ఉన్నాయి…

స్పర్శకాలం – సా.04:58

మధ్య కాలం – సా.05:27

మోక్షకాలం – సా.05:48

ఆద్యంత పుణ్యకాలం – 50 నిమిషములు…

*గ్రహణ దోషము శాంతులు:*

1 ) గ్రహణ స్పర్శకాలం స్నానం ఆచరించి సూర్య గ్రహ & కేతు గ్రహ జపం లేదా వారి వారి ఇష్ట దేవ లేదా గురువులు ఉపదేశించిన మంత్రం, బ్రాహ్మణులు గాయత్రి జపం చేసుకోవాలి…

2) గ్రహణ మధ్యకాలంలో పితృలకు తర్పణం చేయాలి…

3) గ్రహణ మోక్ష కాలం నందు దోషపరిహారం కొరకు గోధుమలు (1250 గ్రాములు ) ఉలవలు (1250 గ్రాములు) రాగి పాత్రలో ఆజ్యం (నెయ్యి) పోసి వెండి సూర్య బింబం, వెండి సర్ప బింబం దక్షిణ సహితముగా దానం చెయ్యాలి…

ఈ గ్రహణం స్వాతి నక్షత్రం తులారాశిలో ఏర్పడనున్నది, కాబట్టి తులారాశివారు గ్రహణం చూడరాదు.
స్వాతి నక్షత్రం వ్యక్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది, మరియు తులరాశిలో చంద్రుడు, సూర్యుడు లేదా తులా లగ్నమైననూ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది
తులారాశి వారు గ్రహణ సమయంలో ధ్యానస్థితిలో ఉండాలి, గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది…

“గోధుమలు, ఉలువలు, బెల్లం, తోటకూర, అరటిపండును” మీ మీ శక్త్యానుసారంగా గోమాతకు సమర్పించండి, ధాన్యాన్ని నానబెట్టినవే తినిపించండి, మీరు పెట్టిన గ్రాసం ఆవు తింటున్నప్పుడు గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోండి.
లేదా ఈ వస్తువులను నిరుపేదలకు కూడా ఇవ్వవచ్చును, రెండింటి ఫలితాలు ఒక్కటే…

*గ్రహణవేధ*

గ్రహణవేధ అనేది గ్రహణసమయానికి ముందు 4 యామముల వ్యవధానంతో ఉంటుంది.
అయితే ఈ సూర్యగ్రహణం గ్రస్తాస్తము కావున శక్తి ఉన్నవారు ఆ రోజంతా ఉపవాసముండి మరునాడు సూర్యోదయం తరువాత శుద్ధసూర్యబింబాన్ని చూసి విడుపుస్నానం చేసి ఏదైనా భుజించాలి.
పుత్రవంతులు కూడా ఈ ఉపవాసము ఉండి తీరాలి, అయితే పిల్లలు, గర్భిణిస్త్రీలు, వృద్ధులు, రోగులు మధ్యాహ్నం 12:58 లోపున భోజనాదులు పూర్తి చేసుకోవాలి…

*ప్రత్యాబ్దికం:*

ధర్మశాస్త్ర గ్రంథాలలో గ్రస్తాస్తమయ సూర్యగ్రహణం లో దీనిని 2 విధాలుగా చెప్పారు.

1. అదే రోజున సూర్యాస్తమయం తరువాత జరిపించాలి. అయితే, గ్రస్తాస్తమయ గ్రహణం కాబట్టి ఆమశ్రాద్ధం జరపాలి.
స్మార్త పండిత సదస్సులలో అదే తీర్మానించారు.

2. ఆరోజు భోజననిషేధమున్నది కనుక మరునాడు సూర్యుని శుద్ధబింబాన్ని చూసిన తరువాత స్నానంచేసి అన్నశ్రాద్ధం జరుపాలి.

మీకు అనుకూలమైనదానిని వికల్పంగా ఎంచుకొనండి…