రేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది..

రేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది..ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనున్నది. ఈ దేశాల్లో ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ చివరిసారి 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. దీని తర్వాత 2046 వరకు ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈసారి సూర్యగ్రహణం భారత్‌ సహా అనేక దేశాల్లో కనిపించటం లేదు. ‘సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు అంతరిక్షంలో సంభవించే అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.సూర్యగ్రహణం విషయానికి వస్తే.. ఇది కంకణాకార గ్రహణం (రింగ్ ఆఫ్ ఫైర్) అంటే, సూర్యుడిని చంద్రుడి పూర్తిగా నిరోధించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలా కాకుండా చంద్రుడు తన కక్ష్యలో భూమి నుంచి దాని సుదూర బిందువు వద్ద లేదా సమీపంలో ఉన్నప్పుడు ఎన్యూలర్ సూర్యగ్రహణం సంభవిస్తుంది. దీని అర్థం చంద్రుడు ఆకాశంలో సూర్యుని కంటే చిన్నగా కనిపిస్తాడు. దానిని పూర్తిగా మూసివేయకుండా అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాడు. చంద్రుడు.. సూర్యుని ప్రకాశవంతమైన ముఖంపై ఒక చీకటి డిస్క్ మాదిరిగా కనిపిస్తాడు. ఇది ప్రకాశించే రింగ్ లేదా ‘రింగ్ ఆఫ్ ఫైర్’ను ఏర్పరుస్తుంది.

NASA ప్రకారం, గ్రహణం అమెరికాలోని ఒరెగాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:13 గంటలకు ప్రారంభమవుతుంది అంటే అప్పుడు మన దేశ భారత కాలమానం ప్రకారం రాత్రి 8.34 గంటలు. అప్పుడు మొదలై.. తెల్లవారుజామున 2.25 గంటలకు ముగుస్తుంది. ఇది కాలిఫోర్నియా, నెవాడా, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్ మీదుగా కొనసాగుతుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ కనువిందు చేసి.. అట్లాంటిక్ మహాసముద్రంలో సూర్యాస్తమయం సమయంలో ముగుస్తుంది. ఈ పాక్షిక గ్రహణం చాలా ప్రాంతాల్లో కనిపించి, పరిశీలకులకు ఆకట్టుకునే దృశ్యాన్ని అందిస్తుంది…