మోసపూరిత ఏజేన్సిలపై కఠినంగా వ్యవహారిస్తాం.నిరుద్యోగ యువత మోసపోవద్దు.. జిల్లా కలెక్టర్ వెంకట్రావు…

Suryapet.
సూర్యాపేట జిల్లా..
జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది..!

గత రెండు రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాలు ఇస్తానంటూ ఓ ఏజెన్సీ వారు తమ వద్ద డబ్బులు వసూలు చేశారని అభియోగాలతో సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేసింది… ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించారు..!!

నిరుద్యోగ యువత మోసపూరితమైన మాటలను నమ్మి ఉద్యోగాల వేటలో యువత మోసపోవద్దు అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో టోకరా అనే శీర్షికతో వివిధ తెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ స్పందిస్తూ కలెక్టరేట్ లో శానిటేషన్ (స్యావెంజర్) నిమిత్తం కమిటీ ద్వారా ముగ్గురు స్యావెంజర్లను టెండర్ నిర్వహించి మణికంఠ ఏజెన్సీ ద్వారా సెప్టెంబర్,2023 మాసంలో తీసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగాల పేరిట మణికంఠ ఏజెన్సీ ఇతరుల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులకు కలెక్టరేట్ కు సంబంధం లేదని బద్నాం చేసే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.సంబంధిత కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్దతిపై నియమించిన వివరాలను జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే కి పంపించటం జరిగిందని, మోసపూరితంగా నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన మణికంఠ ఏజెన్సీ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్ పి కి సూచించారు.యువత మోసపోకుండా సంబంధిత శాఖ ల అధికారులను, ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ వివరాలు తెలుసుకోవాలని ఎక్కడ కూడా ఏజెన్సీ లకు డబ్బులు ఇచ్చి మోసపోకుడదని యువతకు సూచించారు…

జిల్లాలో ఇది కేవలం బయటకి వచ్చిన వార్త మాత్రమేనని.. జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ అమాయక నిరుద్యోగుల వద్ద నుండి నగదు వసూలు చేసినట్టుగా ప్రచారం జోరుగా సాగుతుంది కలెక్టర్ దీనిపై కూడా దృష్టి సారించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..