ఉపాధ్యాయుడి అంత్యక్రియల్ని అడ్డుకున్న గ్రమస్థులు.. మా లెక్క తేలేదాకా అంత్యక్రియలు జరగనీయం..!!!.

అంత్యక్రియలు అడ్డుకున్న అప్పులు ఇచ్చిన వారు….
…………..
కొన్ని సినిమాలలో ఇలాంటి ఘటనలే జరుగుతుంటాయి.. అది కేవలం సినిమాలే అనుకుంటూ ఉంటా కానీ నిజజీవితంలో కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది..

సూర్యపేట జిల్లా,

మునగాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. విజయరాఘవపురం గ్రామంలో అప్పుల బాధలు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గవర్నమెంట్‌ టీచర్‌గా పని చేస్తున్న నరేంద్రబాబు తన తెలిసిన వారి దగ్గర నుంచి, గ్రామస్తుల నుంచి దాదాపు పాతిక కోట్ల రూపాయల అప్పుచేశాడు…

అప్పుల బాధలు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోదేశి నరేంద్రబాబు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు……. నేడు నరేంద్ర బాబు స్వగ్రామంలో బంధువులు అంత్యక్రియలు జరుపుతుండగా అక్కడికి చేరుకున్న అప్పులు ఇచ్చినవారు.. తమ డబ్బులు ఎవరిస్తారు అంటూ,, మా లెక్క ఏమిటో తేల్చాలంటూ అడ్డుకున్న అప్పులు ఇచ్చిన వారు..

చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ,ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.25 కోట్లువరకు అప్పుచేసిన నరేంద్రబాబు..నరేంద్ర బాబు బంధువులకు అప్పులు ఇచ్చిన వారికి మధ్య ఘర్షణ..

తాము ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అప్పటివరకు అంత్యక్రియలు జరగనిచ్చేది లేదని తేల్చి చెప్తున్న నరేంద్ర బాబు బాధితులు….