సూర్యాపేట కు నూతన శోభ…పేట ప్రజలకు అందుబాటులోకి రానున్న బోటింగ్…

*సద్దుల చెరువు టాంక్ బండ్ లో త్వరలో బోటింగ్ ప్రారంభం..

*ట్రయల్ రన్ నిర్వహించిన సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

అతి తక్కువ బడ్జెట్‌లో ఎంతో వినోదాన్ని అందించే సౌకర్యం మనకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది… సూర్యాపేట కు మణిహారం గా అన్న సద్దుల చెరువు టాంక్ బండ్ లో బోటింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే క్రమం లో 2014 కు ముందు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన సద్దుల చెరువు ను.. తాను శాసనసభ్యుడి గా అయిన తరువాత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ప్రతిష్టాత్మకంగా తీసుకుని టాంక్ బండ్ గా మార్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో లో ప్రజలకు ఉల్లాసాన్ని పెంచేలా త్వరలోనే బోటింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో కి రానున్నాయి. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ట్రయల్ రన్ ను విజయవంతం గా నిర్వహించారు.