సూర్యాపేట జిల్లాలో ( 138) నామినేష‌న్లు స్వీకరణ…

సూర్యాపేట
తేదీ.10.11.2023.

జిల్లాలో ( 138) నామినేష‌న్లు స్వీకరణ.

10వ తేదీతో ముగిసిన నామినేషన్ ప్రక్రియ.

కలెక్టర్, జిల్లా ఎన్నిక‌ల అధికారి, ఎస్. వెంకట్రావ్

శాసనసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం చివరి రోజు జిల్లా వ్యాప్తంగా (138) నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. దాఖ‌లైన నామినేషన్లను వివ‌రాల‌ను కలెక్టర్ వెల్లడించారు.

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 35 మంది అభ్యర్థులు 45 నామినేషన్లు దాఖలు చేసారని అలాగే కోదాడ నియోజక వర్గం నుండి 26 మంది 27 నామినేషన్లు వేశారని తెలిపారు.

హుజూర్ నగర్ నియోజ‌క‌వ‌ర్గం 32 మంది అభ్యర్థులు 45 నామినేషన్లు దాఖలు చేసారని తెలిపారు. అలాగే
తుంగతుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుండి 20 మంది అభ్యర్థులు 21 నామినేషన్లు వేశారని మొత్తం జిల్లాలో 113 మంది అభ్యర్థులు 138 నామినేషన్లు సమర్పించారని జిల్లాలో నామినేషన్ ప్రక్రియ 10 వ తేదీతో ముగిసిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు.