వీగిపోయిన సూర్యాపేట చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం…

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై 32 మంది వార్డ్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలిప్ రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది….

అవిశ్వాస‌ తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది.

కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.

దీంతో అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ ప్రకటించారు..