సిరియాపై ఇజ్రాయెల్‌ మరోసారి క్షిపణులతో దాడి..!

సిరియాపై ఇజ్రాయెల్‌ మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. మిలిటరీ ఎయిర్‌బేస్‌పై సిరియా సైన్యాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఇద్దరు సైనికులు మరణించాగా, పెద్దసంఖ్యలో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలోని హామ్స్‌ ప్రావిన్సులో ఉన్న షయ్‌రత్‌ మిలిటరీ ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయిల్‌ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ సైన్యం ప్రకటించింది. దీంతో విమానాశ్రయం స్వల్పంగా ధ్వంసమైందని చెప్పారు. గంతకొంతకాలంగా ఈ విమానాశ్రయాన్ని ఇరాన్‌ వైమానిక దళం ఉపయోగించుకుంటున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ సైన్యాలు దాడులకు దిగినట్లు తెలిపారు. రన్‌వే లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
రెండు నెలల క్రితం సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఇంటెలిజెన్స్‌ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల ఆఫీసులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం క్షిపణులు ప్రయోగించింది. దీంతో ముగ్గురు సైనికులు మరణించగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.