భారత్‌పై న్యూజిలాండ్ ఘనవిజయం…. దీంతో న్యూజిలాండ్ సెమీస్ ఆశలు సజీవం..

మరోసారి భారత్ ఓటమి చవిచూసింది..
భార‌త్ టాస్ ఓడిందో అప్పుడే మ్యాచ్ చేజారిపోయిందని అంతా అనుకున్న‌ట్టే భార‌త్ చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోయింది. 110 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ 14.3 ఓవ‌ర్ల‌లోనే ఇంకా 33 బంతులు మిగిలి ఉండ‌గానే.. 8 వికెట్ల తేడాతో గెలిచింది…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో భాగంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది…న్యూజిలాండ్ అల‌వోక‌గా ఇండియా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఆట‌గాళ్ల‌లో మిచెల్ ఎక్కువ స్కోర్ చేశాడు. 35 బంతుల్లో 49 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియ‌మ్స‌న్ 31 బంతుల్లో 33 ప‌రుగులు చేశాడు. గ‌ప్తిల్‌.. 17 బంతుల్లో 20 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 4 ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీశాడు…

న్యూజిలాండ్ సెమీస్ ఆశ‌లు స‌జీవం…

గ్రూప్ 2లో ప్రస్తుతం పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉండ‌గా.. ఆప్ఘ‌నిస్థాన్ రెండో ప్లేస్‌లో ఉంది. మూడో ప్లేస్‌లో ఉన్న న‌మీబియాను వెన‌క్కి నెట్టి.. న్యూజిలాండ్ మూడో స్థానానికి ఎగ‌బాకి సెమీస్ ఆశ‌ల‌ను స‌జీవం చేసుకుంది. త‌ర్వాత రాబోయే మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిస్తే.. పాక్ త‌ర్వాత సెమీస్‌కు అర్హ‌త సాధించే మ‌రో టీమ్‌గా న్యూజిలాండ్ నిల‌వ‌నుంది..

ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్న టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ(14 బంతుల్లో 14; ఫోర్‌, సిక్స్‌) ఐష్‌ సోధి బౌలింగ్‌లో గప్తిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇషాన్‌ కిషన్‌(4) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ ఐదో బంతిని భారీ షాట్‌కు యత్నించి డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు..