న్యూజిలాండ్ కు తక్కువ 111 టార్గెట్ ను ముందు ఉంచిన భారత్…

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ కు తక్కువ 111 టార్గెట్ ను ముందుంచింది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 , కేఎల్ రాహుల్ 18, రోహిత్ శర్మ 14, కెప్టెన్ కొహ్లీ 9, రిషబ్ పంత్ 12, హార్దిక్ పాండ్యా 23, రవీంద్ర జడేజా 26 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెన్ట్ బౌల్ట్ 3, సోధి 2, టిమ్ సౌథి,అడమ్ మిల్నేకి ఒక వికెట్ పడ్డాయి..