రేపే కాంగ్రెస్ తొలి జాబితా.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితాను రేపు విడుదల చేయనున్నట్లు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ వెల్లడించారు. 58 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు…
రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికల(Telangana Congress) బరిలో దిగే రేసుగుర్రాల తొలి జాబితా సిద్ధమైంది. వివాదాలకు తావులేని 70కిపైగా నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక
(T Congress MLA Candidate List) పూర్తయింది. మంచి రోజులు ప్రారంభమవుతున్నందున తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దిల్లీలోని వార్‌రూంలో సమావేశమై ఖరారు చేసింది. రెండు సమావేశాల్లో ఏడు, ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపిన కమిటీ.. శుక్రవారం మాత్రం కేవలం రెండున్నర గంటల్లోనే భేటీని ముగించింది. 70 సీట్లపైనే ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఒక్కో నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపారు.సీఈసీ సమావేశంలో ఓయూ విద్యార్థుల డిమాండ్లు, ఉదయ్‌పుర్ డిక్లరేషన్, వివిధ సామాజిక వర్గాల వినతులపై చర్చించారు. 70 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆయా స్థానాల్లో గెలుపు ఖాయమనే భావన సభ్యుల్లో వ్యక్తమైంది. 43 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండడంతో వాటికి అభ్యర్థుల ఖరారు బాధ్యతను సీఈసీకి.. స్క్రీనింగ్ కమిటీ వదిలేసింది.
కాంగ్రెస్‌ను గణనీయ స్థానాల్లో గెలిపించాలనే పట్టుదలతో పార్టీ అగ్రనేతలను రప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బస్సుయాత్రలోనే మెనిఫెస్టోను రాహుల్, ప్రియాంకల చేతుల మీదుగా విడుదల చేయించాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 18న జగిత్యాలలో ప్రారంభం కానున్న బస్సుయాత్ర, రోడ్‌షోల కోసం స్థానిక కొత్తబస్టాండ్ చౌరస్తాను ఏఐసీసీ కార్యదర్శి సుశాంక్‌మిశ్రాతో కలిసి ఆయన పరిశీలించారు. ఆదివారం జాబితాను విడుదల చేయకుంటే.. అన్ని స్థానాలకు దసరా రోజున ప్రకటించేందుకు ఆస్కారం ఉందని సమాచారం…