టీ కాంగ్రెస్ (Congress) లో మళ్లీ సీనియర్ల అసమ్మతి కల్లోలంగా మారిందా..!!జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోథాక్రే భేటీ.!!
టీ. కాంగ్రెస్ (Congress) లో మళ్లీ సీనియర్ల అసమ్మతి కల్లోలంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ నుండి రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో వలసలు ఉంటాయని ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఇంటిపోరు గుది బండగా తయారవుతుంది.
తమ పార్టీ నుండి వలసలకు అడ్డుకట్ట వేసే పథకంలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రతి వ్యూహం కాంగ్రెస్ ను కలవరపరుస్తుంది. తమ పార్టీ నుండి కాదు.. మీ పార్టీ నుండే పలువురు సీనియర్లు మా పార్టీలోకి వస్తున్నారంటూ బిఆర్ఎస్ సాగిస్తున్న ప్రచార ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఉత్తమ్, టి. జగ్గారెడ్డిలు బిఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం సాగుతుండగా, కొత్తగా జానారెడ్డి పై కూడా ఇదే తరహా ప్రచారం మొదలైంది.
ఆ సందర్భంలోనే పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు..
*జానారెడ్డి, ఉత్తమ్లతో థాక్రే భేటీ*
ఉమ్మడి నల్లగొండతో పాటు రాష్ట్రస్థాయి రాజకీయాలపై థాక్రే హైదరాబాద్లో జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలతో ప్రత్యేకంగా భేటీ అయి.. పార్టీలో చేరికలు, సీట్లపై ప్రస్తావించారు.
తొలుత జానారెడ్డి ఇంటికి వెళ్లిన థాక్రే సుమారు గంటసేపు చర్చించారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ఉత్తమ్ఇంటికి వెళ్లారు. థాక్రే వేర్వేరుగా వారితో రెండు గంటలు మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రె స్వయంగా రంగంలోకి దిగి శనివారం సాయంత్రం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అటు నుండి ఠాక్రే..జానారెడ్డిలు ఒకే కారులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నందున పరామర్శకు వెళ్లామని వారు చెబుతున్నప్పటికీ పార్టీ మార్పు ప్రచారం, చేరికల వ్యవహారం పై సమాచారం లేని వివాదంతో కినుక వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుజ్జగించేందుకే వారిద్దరు వెళ్లారని తెలుస్తుంది..
సొంత నాయకుల ప్రచారం తోనే ఆవేదన.. ఉత్తమ్..
పార్టీ మారుతున్నానంటూ సాగుతున్న ప్రచారం వెనుక ప్రత్యర్ధి పార్టీ వారి కంటే.. సొంత పార్టీ వారి ప్రమేయం కూడా ఉందన్న ఆవేధన ఉత్తమ్ ను మనస్థాపానికి గురి చేసింది. ఆయా పరిణామాలతో ఇబ్బంది పడిన ఉత్తమ్ కు సర్ది చెప్పేందుకు, చేరికల పైన, పార్టీ మార్పు ప్రచారంపైన స్పష్టతనిచ్చేందుకు మాణిక్ రావు ఠాక్రే ఆయనతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది..పార్టీ మార్పు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్పష్టతనిచ్చినట్లుగా సమాచారం. గతంలోనే కేసీఆర్ తమకు మంత్రి పదవులు ఆశ చూపిన తాము చేర లేదని, అలాంటి తాము ఇప్పుడు ఎందుకు పార్టీని వీడుతామంటూ జానా, ఉత్తమ్ లు పార్టీ మార్పు ప్రచారాన్ని కొట్టిపారేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.