తెలంగాణ అంకురాల సాంకేతిక సంస్థ (టీ-హబ్‌) కొత్త సీఈవోగా ఎం.శ్రీనివాసరావు..

టీ-హబ్‌ సీఈవోగా శ్రీనివాసరావు.

తెలంగాణ అంకురాల సాంకేతిక సంస్థ (టీ-హబ్‌) కొత్త సీఈవోగా ఎం.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఐటీ పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్న ఆయన టీ-హబ్‌ పగ్గాలు చేపట్టనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేశారు. సొనాటా సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి 1990-92 వరకు కంప్యూటర్‌ విజన్‌ లేబరేటరీలో పనిచేశారు. తరువాత కొందరితో కలిసి 1999లో నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ (నెట్‌సోల్‌) సంస్థ నెలకొల్పారు. ఈ సంస్థను ఐబీఎం కొనుగోలు చేసింది. తరువాత ఏర్పాటుచేసిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీకి సహవ్యవస్థాపకుడిగా, సీఈవోగా వ్యవహరించారు. ఈ సంస్థను 2019లో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి చెందిన ఎన్‌ఎస్‌ఈఐటీ సంస్థ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎం.శ్రీనివాసరావు గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ మాస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌(గేమ్‌)కు సీఈవోగా, బెంగళూరు టీఐఈకి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు…