శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం..

రెండు గ్రూప్ లుగా విడిపోయి ఆడుతున్న మ్యాచ్ లలో ఏ నాలుగు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి అన్న విషయంలో ఒక క్లారిటీ రాలేదు. అయితే ఈ రోజు శ్రీలంకకు మరియు సౌత్ ఆఫ్రికా కు మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 142 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ..

శ్రీలంక రైజింగ్ స్టార్ వాసిందు హసరంగ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఎయిడెన్ మార్క్రమ్‌, టెంబా బవుమా, డ్వేన్ ప్రిటోరియస్‌ను వరుస బంతుల్లో అవుట్ చేసిన హసరంగ ఈ రికార్డు సాధించాడు..

చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మిల్లర్.. లంకపై దక్షిణాఫ్రికా విజయం..

చివర్లో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో డేవిడ్ మిల్లర్‌ (23) వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాది టెన్షన్ తగ్గించాడు. ఆ తర్వాత ఫోర్ కొట్టిన రబాడ (13) మ్యాచ్ పూర్తి చేశాడు…శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం నమోదు చేసింది. దీంతో గ్రూప్‌-1లో ఆడిన మూడు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా రెండు విజయాలు నమోదు చేయగా, శ్రీలంక మాత్రం మూడింట రెండు ఓటములను చవిచూసింది. లంక బౌలర్లలో హసరంగ 3, చమీర 2 వికెట్లు పడగొట్టారు…