అఫ్గానిస్థాన్‌ పై విజయంతో సెమీస్ లో న్యూజిలాండ్‌…టీమ్‌ ఇండియా ఇక ఇంటికే …

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అన్ని విభాగాల్లో రాణించి అఫ్గానిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 124 పరుగులకే కట్టడి చేసిన కివీస్‌.. అనంతరం కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ (40*), కాన్వే (36*), మార్టిన్‌ గప్తిల్ (28), మిచెల్‌ (17) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో గ్రూప్‌-2లో రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది.
అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్ తీశారు. ..
అఫ్గానిస్థాన్‌ మీద విజయంతో న్యూజిలాండ్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లింది.టీమిండియా ఆశలు కూడా ఆవిరయ్యాయి.. ఇక రేపు (సోమవారం) నమీబియాతో భారత్‌ పోరు నామమాత్రమే.

గ్రూప్‌-2 నుంచి సెమీస్ చేరే రెండు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే నాలుగు విజయాలతో పాకిస్థాన్‌ సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం న్యూజిల్యాండ్‌, భారత్‌, ఆఫ్ఘన్ జట్లు పోటీలో ఉన్నాయి. ఆఫ్ఘన్‌ను ఓడించిన కివీస్‌ ఈ బెర్తు దక్కించుకుంది…