తొలి టీ20లో భారత్ ఘ‌న విజ‌యం..

భారత్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది…

లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు మాత్ర‌మే చేయడంతో భారత్ 62 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ….లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన‌ 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన లంక నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దాంతో భారత్ 62 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. చరిత్ అసలంక (53; 47 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. చమిక కరుణరత్నే (21), దుష్మంత చమీర (24) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేష్ అయ్యర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భువనేశ్వర్‌ కుమార్ వేసిన తొలి బంతికే పథుమ్‌ నిశాంకని బౌల్డ్ చేశాడు. కాసేపటికే మరో ఓపెనర్‌ కమిల్ మిశారా (13) భువీ బౌలింగ్లోనే రోహిత్‌ శర్మకి క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆపై జనిత్ లియనగె (11), దినేశ్ చండిమాల్ (10), దసున్ శనక (3) విఫలమ్యారు. ఈ సమయంలో చరిత్‌ అసలంక, చమిక కరుణరత్నె కాసేపు నిలకడగా ఆడారు. అయితే 16వ ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌.. కరుణరత్నెను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో వచ్చిన దుష్మంత చమీర 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, వెంకటేశ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, చహల్‌ తలో వికెట్ తీశారు.