టీ20 తోలి మ్యాచ్‌లో టీమ్ ఇండియాపై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య ఉత్కంఠగా సాగిన తొలి టీ-20లో సఫారీలు బోణి కొట్టారు...

దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో టీమ్ ఇంియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టీ20 ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా ఆరంభం నుంచే ధాటిగా ఆడసాగింది. తొలి ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడుతున్న సమయంలో తొలి వికెట్ రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చెలరేగి ఆడారు. పది ఓవర్లు ముగిసేసరికి 102 పరుగులు పూర్తి చేసేశారు. ఇషాన్ కిషన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో 76 పరుగుల వద్ద ఇషాన్ అవుటయ్యాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది….212 పరుగుల టార్గెట్ ను మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చేధించారు. మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లోనే టార్గెట్ ను చేధించారు. మ్యాచ్ మధ్యలో సఫారీలు చతికిలపడుతున్నారని భావించిన సమయంలో డేవిడ్ మిల్లర్, డస్సెన్ మ్యాచ్ ను మలుపు తిప్పారు. డస్సెన్ 46 బంతుల్లో 75 పరుగులు చేయగా మిల్లర్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి..
అనూహ్యంగా దక్షిణాఫ్రికా విజయాన్ని అందించారు.. అంతకు ముందు . భారత్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ 76 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 36 పరుగులు చేశారు రుతరాజ్ గైక్వాడ్ 23, రిషబ్ పంత్ 29, హార్ధిక్ పాండ్యా 31 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహరాజ్, పిట్రోరియస్, పార్ నెల్, నార్జ్ తలో వికెట్ తీశారు….