నమీబియా పై భారత్ విజయం…విజయంతో ఇంటి దారి పట్టిన టీమిండియా.

టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో.. హ్యాట్రిక్ విజయం సాధించిన భారత్….

పాకిస్తాన్ , న్యూజిలాండ్ మ్యాచ్ ఓటమి తో సెమీస్ కి చేరుకోలేని భారత్..

నమీబియా పై సమిష్టిగా రాణించిన భారత్..
తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం…

విజయంతో ఇంటి దారి పట్టిన టీమిండియా… టీ-20లో పాకిస్తాన్, న్యూజిలాండ్ పై ఓటమితో భారత్ సెమీస్ కి చేరుకోలేకపోయింది….రన్ రేట్ భారీగా ఉన్న పాయింట్ల పట్టికలో వెనుక పడటంతో భారత్ ఇంటిముఖం పట్టక తప్పలేదు..

టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది. నామమాత్రమే అయిన మ్యాచ్‌లో పసికూన నమీబియాపై 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు ప్రత్యర్థి నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన వికెట్‌ నష్టానికి ఛేదించింది. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (56), కేఎల్‌ రాహుల్ (54*) అర్ధశతకంతో అదరగొట్టగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (25*) నాటౌట్‌గా నిలిచాడు. నమీబియా బౌలింగ్‌లో ఫ్రైలింగ్‌ ఒక వికెట్‌ తీశారు..