ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై టీమిండియా ఘనవిజయం..

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా చిరస్మరణీయం విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విక్టరీ నమోదు చేసింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ..

ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో పాక్ పే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది… పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని అఖరి ఓవర్లో భారత్ ఛేదించింది. భారత్ బ్యాటర్లలో రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) విఫలమైయినప్పటికీ విరాట్ కోహ్లీ (82 నాటౌట్), హార్దిక్ పాండ్య (40)రాణించి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు…చివరి ఓవర్లో మలుపు తిరిగిన మ్యాచ్
చివరి ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది. 6 బంతుల్లో 16 పరుగులు అవసరం కాగా చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాక్ చేసిన తప్పిదాలు భారత్ కు వరంగా మారాయి. రెండు వైడ్స్, ఒక నో బాల్ తో పాక్ మ్యాచ్ ను చేజార్చుకుంది. పాండ్యా , దినేష్ కార్తీక్ ఔటైన కోహ్లీ చివరి వరకూ ఉండి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.

కోహ్లీని ఎత్తుకున్న రోహిత్ శర్మ…

53 బంతుల్లో 82 రన్స్ చేసి ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించిన విరాట్ కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భూజల పై ఎత్తుకుని సంతోషంగా తిప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. సహచరులు కూడా కోహ్లీని అభినందించారు.