ఇవాళ్టి నుంచి టీ 20 ప్రపంచ కప్‌ లో…సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి…

టీ-20 వరల్డ్ కప్ సమయం రానే వచ్చింది. ఇవాళ్టి నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్‌-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ తలపడతాయి. ఈ కప్‌ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభమైంది…
ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్‌-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ తలపడతాయి.

పాకిస్థాన్‌తో గ్రూప్ బీలో భారత్..
యూఏఈలో ఈ జట్లు అభిమానుల సమక్షంలో టైటిల్ కోసం సవాలు చేస్తాయి. ఐపీఎల్ లాగా టీ20 ప్రపంచ కప్ కోసం అభిమానులు కూడా స్టేడియానికి వచ్చేందుకు అనుమతి ఉంది. ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరుగుతాయి. టీ 20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు గ్రూప్ 2 లో భారత్ స్థానం పొందింది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్‌లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్ 2 లో భారత్, పాకిస్థాన్‌లు చోటు దక్కించుకున్నాయి.
నాకౌట్ రౌండ్ సెమీ ఫైనల్స్ నుంచి ప్రారంభమవుతుంది. టోర్నమెంట్ నాకౌట్ దశ సూపర్ 12 రౌండ్ తర్వాత ప్రారంభమవుతుంది. 12 జట్లలో నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. టోర్నమెంట్‌లో మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 10 న జరుగుతుంది. రెండవ సెమీ ఫైనల్ నవంబర్ 11 న జరుగుతుంది. తుది మ్యాచ్ నవంబర్ 14 న దుబాయ్‌లో జరుగుతుంది. నవంబర్ 15 ఫైనల్ కోసం రిజర్వ్ డేగా ఉంచబడింది.