వీసాల విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి…. భారత్ కు పాక్ హెచ్చరిక

:….
వీసాల విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.. లేదంటే ప్రపంచకప్ వేదిక మార్చాల్సివస్తుంది.. భారత్ కు పాక్ హెచ్చరిక…

ఈ ఏడాది మరో ప్రపంచ కప్ నిర్వహణకు భారత్ వేదిక కానున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బోర్డు అప్పుడే తన అక్కసును ఓ రేంజ్ లో వినిపిస్తోంది. భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనడానికి పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు జర్నలిస్టులకు అభిమానులకు భారత్ వీసాలు మంజూరు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అంతేకాదు.. ఇదే విషయంపై మార్చి నెలాఖరులోగా బీసీసీఐ తన నిర్ణయం చెప్పాలని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి చెప్పారు.

ఈ మేరకు బీసీసీఐ లిఖిత పూర్వక హామీనివ్వాలని.. త్వరలోనే ఫాన్స్ కు జర్నలిస్టులకు వీసాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు..ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ నెలల్లో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. దీనికి సంబంధించిన వీసాలను మార్చిలోగా మంజూరు చేయాలని పీసీబీ కోరుతున్నది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.