టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెం.1 సూర్యకుమార్ యాదవ్…

టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెం.1గా సూర్యకుమార్ యాదవ్..

భార‌త స్టార్ క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) టీ20ల్లో అగ్ర‌స్థానం నిలబెట్టుకున్నాడు. అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1గా నిలిచాడు. టీ20 ఆల్‌రౌండ‌ర్ల‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కిబుల్ హ‌స‌న్‌(Shakib Al Hasan) టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో రెండో ర్యాంక్ సాధించాడు…

ఈరోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించింది. వెస్టిండీస్‌పై ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన సూర్య 907 పాయింట్ల‌తో టాప్‌లో ఉన్నాడు. పాక్ ఓపెన‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్(Mohammad Rizwan) రెండో స్థానం ద‌క్కించుకున్నాడు. బాబ‌ర్ ఆజాం(Babar Azam) మూడు, ఎయిడెన్ మ‌ర‌క్రం(Aiden Markram) నాలుగు, రీలే ర‌స్సో(Rilee Rossouw) ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు.విరాట్ కోహ్లీ(Virat Kohli) 17వ స్థానం, రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) 34వ ప్లేస్‌లో ఉన్నారు. విండీస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన‌ తిల‌క్ వ‌ర్మ(Tilak Varma) 46వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క భార‌త క్రికెట‌ర్ కూడా టాప్ 10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు…

టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. బ్యాటింగ్ విభాగంలో ఏకంగా 43 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో అతను 77 పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే.

విండీస్‌ సిరీస్‌లో రాణించిన కుల్దీప్ యాదవ్ 23 స్థానాలను వెనక్కినెట్టి 28వ ర్యాంక్‌ సాధించాడు. ఐదు మ్యాచ్‌ల్లో అతను 6 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 2వ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ 288 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు..