ఇండియ‌న్ ఆర్మీకి చెందిన టీ-90 భీష్మ యుద్ధ ట్యాంక్…

72వ గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఢిల్లీలోని రాజ్‌ప‌థ్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. సైనిక ద‌ళాలు త‌మ స‌త్తాను చాటాయి. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన టీ-90 భీష్మ యుద్ధ ట్యాంక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప‌రేడ్ సంద‌ర్భంగా టీ-90 భీష్మ‌ను ప్ర‌ద‌ర్శించారు. 54వ రెజిమెంట్‌కు చెందిన‌ కెప్టెన్ క‌ర‌ణ్‌వీర్ సింగ్ భంగూ .. ట్యాంక్‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ప‌రేడ్‌లో బంగ్లాదేవ్ ఆర్మీ బ్యాండ్ కూడా పాల్గొన్నది. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ అబూ మొహ‌మ్మ‌ద్ షానూర్ షావ‌న్ నేతృత్వంలో ఈ బ్యాండ్ ర్యాలీ తీసింది. తొలిసారి బంగ్లా బ్యాండ్ పాల్గొన్నది. దీంట్లో 122 మంది స‌భ్యులు ఉన్నారు.బ్ర‌హ్మోస్ మిస్సైల్‌కు చెందిన ఆటోన‌మిస్ లాంచ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. కెప్టెన్ ఖ‌మ్రుల్ జ‌మాన్ నేతృత్వంలో బ్ర‌హ్మోస్‌ను ప్ర‌జెంట్ చేశారు. ఇండియా, ర‌ష్యా దేశాలు సంయుక్తంగా ఈ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేశాయి. 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను బ్ర‌హ్మోస్ చేధించ‌గ‌ల‌దు. 841 రాకెట్ రెజిమెంట్‌కు చెందిన పినాకా మ‌ల్టీ లాంచ‌ర్ రాకెట్ సిస్ట‌మ్‌ను ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శించారు. కెప్టెన్ విభోర్ గులాటీ ఈ టీమ్‌ను లీడ్ చేశారు. 214 ఎంఎం పినాకా ఎంబీఆర్ఎల్‌.. అడ్వాన్స్‌డ్ రాకెట్ సిస్ట‌మ్‌. ఇది సంపూర్ణంగా ఆటోమెటిక్ లాంచ‌ర్‌. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఈ రాకెట్ ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.