నా గెలుపు ఉగాది పచ్చడిలా ఉంది. నా గెలుపులో తీపి వేసింది ఎవరో మీకు తెలుసు, చేదు వేసింది ఎవరో మీకు తెలుసు…టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు.

ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి..

అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్‌ ఓటింగ్‌ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు…ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా ఉంది. నా గెలుపులో తీపి వేసింది ఎవరో మీకు తెలుసు, చేదు వేసింది ఎవరో మీకు తెలుసు.. అలానే ఇప్పుడు ఏ తప్పు జరిగిందో 2018లో కూడా అదే తప్పు జరిగిందని పేర్కొన్నారు. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది.. కానీ, ఈ రోజు రాజకీయాలు అభివృద్ధికి నోచుకునే వారికన్నా డబ్బుకోసం రాజకీయం చేస్తున్న నేతలే ఉన్నారని కామెంట్ చేశారు..