టబూ కు షూటింగ్ లో ప్రమాదం….

ఒకేరోజు ముగ్గురు చిత్ర పరిశ్రమకు చెందిన వారు ప్రమాదానికి గురయ్యారు. బాలివుడ్ నటి టబు, శిల్పా శెట్టి కి షూటింగ్ సమయంలో గాయాలయ్యాయి. అలాగే హీరో విశాల్ కు కూడా షూటింగ్ లోనే గాయాల పాలయ్యారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలివుడ్ నటి టబు భోలా సినిమాలో నటిస్తున్నారు.

అజయ్ దేవ్ గన్ , టబు కీలక పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. టబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది ఈ చిత్రంలో.

ఇక టబు పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో కారు అద్దాలు పగిలి కంటి కి
, నుదుటిపై గాయాలు అయ్యాయి. దాంతో ఒక్కసారిగా యూనిట్ సిబ్బంది షాక్ కు లోనయ్యారు. వెంటనే టబు ని చూడగా తీవ్ర గాయాలు అయి రక్తస్రావం జరుగుతుండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాంతో షూటింగ్ నిలిచిపోయింది.